98.8 శాతం పిల్లలకు
చుక్కల మందు
చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో 98.8 శాతం మంది పిల్లలకు చుక్కల మందును పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 1001 పల్స్ పోలియో కేంద్రాలు, 925 బూత్ లెవల్ బృందాలు, 38 మొబైల్ బృందాలు, మరో 38 ట్రాన్స్‌పోర్ట్ బృందాలతో ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు. మిగిలిపోయినవారికి సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కల మందు చేయనున్నారు. ఈసారి జిల్లాలో 98,818 మంది పిల్లలకు చుక్కల మందు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
పోలియో నిర్మూలనలో భాగస్వాములు కావాలి
పాల్వంచరూరల్: పోలియో నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండల పరిధిలోని జగన్నాథపురం పీహెచ్‌సీ పరిధి ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. చిన్నారికి పోలియో డ్రాప్స్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, అధికారులు ప్రతాప్, మోహారక్రాంతి పాల్గొన్నారు.


