రాత్రుళ్లు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్
జిల్లాలో ఎక్కడా లేంది..
ఇక్కడేనంటూ విమర్శలు
కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సిబ్బంది
పాల్వంచ: జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో మాత్రమే రాత్రి ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో కేసులను రాత్రి వరకు పెండింగ్‌లో పెట్టి, చివరికి ఎఫ్‌ఐఆర్ చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో మరింత ఇబ్బంది కరంగా మారాయి. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది సైతం అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని వారిలో వారు కుమిలిపోతున్నారు. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కొన్ని నెలలుగా పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు?
పట్టణంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అనేక సమస్యలతో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నా రు. గొడవలు, కొట్లాటలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, ప్రమాదాలు, అనుమానాస్పద మృతు లు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, ఆందోళనలు, ట్రాఫిక్, వాహన తనిఖీలు, ఇలా అనే క చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మో పడంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షించే క్రమంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వచ్చే ఫిర్యాదులపై కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు నేరాల కు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ముందస్తుగా కేసుల నమోదు ప్రక్రియ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కేసులను రాత్రి వరకు నాన్చుతూ ఆలస్యంగా నమోదు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి వరకు వేచిచూసి, చివరి నిమిషంలో కేసులు నమోదుచేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి కొంతకాలంగా కొనసాగుతుండగా సిబ్బంది అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించలేక, బయటకు చెప్పలేక లోలోన మదనపడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొన్ని కేసులు మీడియా దృష్టికి సైతం రావడం లేదు. కేసులు సకాలంలో నమోదు కాక పోవడంతో సరైన వివరణ ఉండటం లేదనే వాదనలు ఉన్నాయి.
కేసుల ఆలస్యంపై దృష్టేది?
ఘటన జరిగిన వెంటనే వాటికి సంబంధించిన వివరాలు సేకరించి, వెంటనే ఎఫ్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో అన్ని స్టేషన్లలో ముందస్తుగానే కేసులు అవుతుండగా, ఇక్కడ అందుకు భిన్నంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు లు రాత్రి 8 గంటల కల్లా నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదేమంటే ఫిర్యాదుదారులు చర్చించుకుని, చివరి నిమిషంలోనే ఫిర్యాదు ను అధికారులకు ఇస్తున్నారని సిబ్బంది వాపోతుండటం పరిపాటిగా మారింది. రాత్రి వేళ జరిగిన సందర్భాలు మినహా ముందస్తుగా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన వాటికి వెంటనే ఎఫ్‌ఐఆర్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా ఫిర్యాదులను అన్ని కోణాల్లో పరిశీలించి, ముందస్తుగా వారి కి కౌన్సెలింగ్ చేయడం, అవసరమైన వాటికి వెంటనే కేసులు నమోదయ్యేలా చేస్తున్నామని, ఎలాంటి ఆలస్యం చేయడం లేదని తెలిపారు. అయితే, ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదుల సమయాన్ని బట్టి ఉంటుందని వివరించారు.
కేసుల నమోదులో
తాత్సారం!


