పాల్వంచ: పాల్వంచకు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్ ఉప్పుశెట్టి రాకేశ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్‌ఐఎస్ (నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) నుంచి కోచ్‌గా గుర్తింపు లభించింది. బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కొనసాగుతున్న నేతాజీ సుభాష్ సదరన్ సెంటర్‌లో ఆయన బాస్కెట్‌బాల్ కోర్సు పూర్తి చేయడంతో ఎన్‌ఐ ఎస్ సర్టిఫికెట్ జారీచేశారు. ఆధునిక శిక్షణ విధానాలు, క్రీడావిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వానికి సంబంధించిన అంశాల్లో కోర్సు పూర్తిచేసిన రాకేశ్‌ను పలువురు క్రీడాకారులు అభినందించారు.
యువ వ్యాపారి ఐపీ?
భద్రాచలంటౌన్: వ్యాపారంలో భారీగా నస్టా లు రావడంతో భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువ వ్యాపారి దివాలా (ఐపీ) పిటిషన్ దాఖలు చేసేందుకు యత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐటీసీ కాంట్రాక్టర్‌గా, ట్రావెల్స్ బస్సుల నిర్వహణలో ఉన్న ఆ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే,యీ అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ప్రకటన రాలేదు. ఈ విషయానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు, సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
పిచ్చికుక్క స్వైర విహారం
రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక, కోయ చలక గ్రామాల్లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రేగులచలక ఎస్సీకాలనీకి వచ్చిన కుక్క అక్కడ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆర్‌ఎంపీ నార పోగు రాంబాబు కుమారుడు శశీంద్ర ముఖంపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అలాగే, కలకోట కృష్ణ, మరో వ్యక్తిని సైతం కుక్క కరిచింది. అంతేకాక పశువులు, కోళ్లను కూడా కరిచిందని గ్రామస్తులు తెలిపారు. కాగా, శశీంద్రకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆలయ హుండీ తాళాలు
ధ్వంసం
కేశవాపురం గ్రామంలో ఉద్రిక్తత
తల్లాడ: మండలంలోని కేశవాపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీ తాళాలను ఆదివారం ఓ వర్గం వారు పగలగొట్టారు. వచ్చేనెల మొదటి వారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించనుండగా, జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం ఆలయ నిర్వహణ, హుండీ విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల సమక్షాన హుండీకి రెండు తాళాలు వేశారు. భవిష్యత్‌లో అందరూ ఏకతాటిపైకి వచ్చాకే రెండు తాళాలను తెరవాలని నిర్ణయించారు. ఇంతలో ఆదివారం ఓ వర్గం వారు హుండీ తాళాలు తీస్తామని గ్రామంలో చాటింపు వేయించడమే కాక తాళాలను పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఎప్పుడేం జరుగుతోందనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానికులు పలువురు తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


