మున్సిపాలిటీ పరిధిలోని బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు పరదానే దిక్కయింది. గత రెండేళ్లుగా కురుస్తున్న వానలకు క్రమక్రమంగా ప్రహరీ కూలింది. దీంతో విద్యార్థులు చదువుకునే సమయంలో పశువులు, ఆవులు ప్రవేశిస్తూ.. ఇబ్బందులకు గురి చేయడంతో పాటు రాత్రివేళ కుక్కలు పాఠశాల ఆవరణను ఆవాసంగా మార్చుకున్నాయి. చెట్టు వేర్లు పక్కనే ఉన్న సైడ్ కాల్వల్లోకి చొచ్చుకుపోయి ప్రహరీ నిర్మించే అవకాశం లేకపోవడంతో తడిక సాయంతో ఇలా పరదా కట్టి తాత్కాలికంగా అడ్డు ఏర్పాటు చేశారు. వానాకాలం గాలిదుమ్ముకు పాత స్థితికి వచ్చే అవకాశం ఉంటుందని, సైడ్ కాల్వ నుంచి పాఠశాలలోకి పాములు, పురుగులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్


