లైంగిక దాడులు, లైంగిక యత్నాలకు గురైన మైనర్లు, యువతులు నేరుగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే భరోసా సెంటర్‌కు వెళ్లినా అక్కడి సిబ్బంది అండగా నిలుస్తారు. ఈ సెంటర్‌లో పోలీసు, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలు ఒకే గొడుగు కింద అందుతాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గోప్యంగా సాయం అందేలా చూస్తారు. అలాగే, వైద్యపరీక్షలు, చికిత్స అందించడంతో పాటు నిపుణులైన సైకాలిజిస్టుల ద్వారా కౌన్సెలింగ్‌తో మనోఽధైర్యాన్ని నింపుతారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు మొదలు కోర్టు విచారణ పూర్తయ్యేవరకు నిపుణుల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సాయం దక్కేలా చూస్తారు.


