రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jun 28 2026 12:10 AM | Updated on Jun 28 2026 12:10 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

విధుల్లో చేరిన

డీపీఓ అనూష

చుంచుపల్లి: జిల్లాలో పనిచేస్తూ శాఖాపరమైన శిక్షణకు వెళ్లొచ్చిన డీపీఓ బొప్పన అనూష శని వారం తిరిగి విధుల్లో చేరారు. ఎనిమిది నెలల క్రితం ఆమెను జిల్లాకు కేటాయించగా ఇటీవల శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో ఇన్‌చార్జిలుగా మొద ట సుధీర్‌కుమార్‌, ఆ తర్వాత డీఆర్‌డీఓ విద్యాచందన వ్యవహరించారు. తిరిగి బాధ్యతల్లో చేరిన డీపీఓను పలువురు ఎంపీడీఓలు, అధికా రులు, కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలి

ఇల్లెందు: రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలని బీజేపీ అనుబంధ జాతీయ కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం ఇల్లెందు ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించిన కిసాన్‌ మోర్చా రైతు కార్యశాల కార్యక్రమంలో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతం అవుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో విస్తరింపచేయాలని, ప్రతీ రైతు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భరత్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చిలు కూరి రమేష్‌, నాయకులు శ్రీనివాస్‌, బాలరాజు, భిక్షపతి, వెంకన్న, బాలగానీ గోపీకృష్ణ, నాళ్ల సోమసుందర్‌, మావునూరి మాధవ్‌, మురళీకృష్ణ, సుచిత్ర పాసీ, బట్టు రమేష్‌ పాల్గొన్నారు.

యంత్రాలతో

మక్కలు వేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): మొక్కజొన్న విత్తనాలను సంప్రదాయ పద్ధతికి బదులు యంత్రాల ద్వారా వేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందని, కూలీల ఖర్చు తగ్గుతుందని మొ క్కజొన్న పరిశోధనా విభాగం హెడ్‌ డాక్టర్‌ సుశీ ల అన్నారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మొక్కజొన్న పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్‌ మొక్కజొన్న పరిశోధనా విభాగం సాంకేతిక సహకారంతో మొక్కజొన్న సాగు–మెళకువలపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడా రు. మొక్కజొన్న పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ భద్రు మాట్లాడుతూ మొక్కజొన్న విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు మొక్కజొన్న విత్తనా యంత్రాలు, టార్పాలిన్‌ పట్టాలు, కలు పు మందులు పంపిణీ చేశారు. శాస్త్రవేత్త డాక్టర్‌ అనూష, సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎం. శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌ లలిత కుమారి, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ భరత్‌, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement