● రామాలయ అభివృద్ధి పనులు చేపట్టాలి ● ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్
భద్రాచలం: భక్తులకు అసౌకర్యం కలగకుండా రామాలయ అభివృద్ధి పనులు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ అన్నారు. శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించి, ఆలయ పునరుద్ధరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రామాలయ అభివృద్ధి పనులు ప్రారంభించిందని తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు తెలిపా రు. పునరుద్ధరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర రావు, ఇరిగేషన్ ఈఈ జానీ, భద్రాచలం డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాస్, వేద పండితులు,అధికారులు పాల్గొన్నారు.


