భద్రాచలంటౌన్: జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌లో రాణిస్తున్న భద్రాచలానికి చెందిన ఎస్‌ఐబీ విశ్రాంత ఉద్యోగి దేశరాజు వెంకట శంకర్‌రావును కేంద్ర ప్రభుత్వ వయోశ్రేష్ట సమ్మాన్ జాతీయ అవార్డుకు నామినేట్ చేయాలని ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన అసోసియేషన్ 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పవర్‌లిఫ్టింగ్‌లో శంకరరావు సాధించిన విజయాలకు గుర్తింపుగా అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ ఆయనను ఘనంగా సత్కరించారు. గుండె బైపాస్ శస్త్రచికిత్స జరిగినా అధైర్యపడకుండా కఠోర సాధన చేశారని అసోసియేషన్ ప్రతినిధులు ప్రశంసించారు. వృద్ధాప్యాన్ని జయించి జాతీయ స్థాయిలో రికార్డులు నెలకొల్పుతూ సీనియర్ సిటిజన్లకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.


