బూర్గంపాడు: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని బూర్గంపాడు, ఇరవెండి, మోతె గ్రామాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటర్లు తమ పూర్తి వివరాలను నమోదు చేసి తిరిగి అందించాలన్నారు. సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమేనని తెలిపారు. అపోహలు, భయాందోళన చెందకుండా ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, బీఎల్‌ఓలు పద్మ, దీపిక, శ్రీలక్ష్మి, మేరీ, చందు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్


