గని ప్రమాద అమరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

గని ప్రమాద అమరులకు నివాళి

Jun 27 2026 12:07 AM | Updated on Jun 27 2026 12:07 AM

ఇల్లెందు: పట్టణంలోని 24 ఏరియాలో గతంలో మొహర్రం నాడు సింగరేణి కాలరీస్‌ ఇల్లెందు ఏరియా స్ట్రట్‌ ఇంక్లైన్‌ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య నివాళులర్పించారు. శుక్రవారం వారి సమాధులపై పూలమాలలు వేసిన జీఎం మాట్లాడారు. 1938లో 37 మంది పురుషులు ఆరుగురు మహిళలు మొత్తం 42 మంది గని ప్రమాదంలో మృతి చెందారని, ఏటా మొహర్రం సందర్భంగా గని ప్రదేశంలో నివాళులర్పిస్తున్నామని తెలిపారు. జేకేఓసీ పీఓ జాకీర్‌ హుస్సేన్‌, డీజీఎం రవికుమార్‌, పూర్ణచందర్‌, దామోదర్‌, రాందాస్‌, అంజిరెడ్డి, సతీశ్‌, డేవిడ్‌, సుధాకర్‌, నజీర్‌ అహ్మద్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, పాసీ ఉద్యోగులకు ఇల్లెందు ఏరియా పాసీ కులస్తులు ఘన నివాళులర్పించారు. రాంలాల్‌ పాసీ, ఆనంద్‌కుమార్‌ పాసీ, కిషన్‌ పాసీ, దుద్దు పాసీ, రోహిత్‌ పాసీ, సంజు పాసీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement