ఎయిర్‌పోర్టుపై మళ్లీ ఆశలు! | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుపై మళ్లీ ఆశలు!

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

న్యూస్‌రీల్‌

20 ఏళ్ల కల

కొత్త స్థలంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు

పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కేంద్రం ఆదేశాలు

శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026

దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గతంలో ప్రతిపాదించిన స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించింది. అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలించే పనిని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

రెండు ప్రతిపాదనలు

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై పట్టువదలని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆర్నెళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. గతంలో సూచించిన రెండు స్థలాలను మినహాయించి మరో స్థలాన్ని ప్రతిపాదిస్తే ఫీజుబులిటీ, టెక్నికల్‌ సర్వే చేపడతామని కేంద్ర ఏవియేషన్‌ శాఖ సూచించింది. దీంతో పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిధిలో ఒకే బిట్టుగా ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నా చివరకు ఆ స్థలం సరికాదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో గతంలో సుజాతనగర్‌, చుంచుపల్లి మండలాల పరిధిలో ప్రతిపాదించిన స్థలానికి దగ్గర్లోనే కొండలు, వాగులకు దూరంగా మరో స్థలాన్ని ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం పరిశీలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఒక వేళ ఇక్కడ కూడా ఇంతకు మునుపులా సాంకేతిక ఇబ్బందులు వస్తే జిల్లా కేంద్రానికి దూరంగా నిర్మించాలనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం.

నాలుగు రాష్ట్రాలకు అనువుగా..

జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఎంతగా ప్రయత్నించినా సాంకేతిక చిక్కుల సమస్య తీరడం లేదు. దీంతో కొత్తగూడెం నుంచి దూరమైనా నాలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉండే దుమ్ముగూడెం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దుమ్ముగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరిగితే భద్రాచలానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఉపయుక్తంగా ఉంటుంది. సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నిర్మాణం పూర్తయితే అటు మణుగూరుకు దగ్గర అవుతుంది. ఖనిజ సంపదకు నెలవైన ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో త్వరలో జరగబోయే పారిశ్రామికీకరణకు ఎయిర్‌పోర్టు ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా ఎయిర్‌పోర్టు అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలనే ఉద్దేశంతో దుమ్ముగూడెం మండలాన్ని తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ఈ మేరకు చుంచుపల్లి సుజాతనగర్‌, దుమ్ముగూడెం మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఫారెస్టు, ప్రైవేటు భూ రికార్డులను పరిశీలించే పనిని రెవెన్యూ విభాగానికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఒకసారి పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

కొత్తగూడెంఅర్బన్‌: ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం వెల్లడించారు. జిల్లాలో 1,313 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 1,214 మంది ఉత్తీర్ణులయ్యారు. 92.46 శాతం ఉత్తీర్ణత నమోదైందని డీఈఓ డి.వాసంతి తెలిపారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం శుక్రవారం నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రీ కౌంటింగ్‌కు రూ.500 , రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలని తెలిపారు.

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరెడ్డి

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ అంకిత్‌ను కలిసి మొక్క అందజేశారు. గతంలో ఇక్కడ పని చేసిన జానయ్య ఖమ్మం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో శంషాబాద్‌ ఏఈఎస్‌గా పని చేస్తున్న శ్రీనివాస రెడ్డిని జిల్లాలో నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ కోసం 20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా పాల్వంచ మండలంలో సర్వే నిర్వహించారు. ఇక్కడ కేటీపీఎస్‌ పరిశ్రమ విస్తరించి ఉండటం, ఆ పరిశ్రమ తాలుకూ ఎత్తైన టవర్లు, హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లు సాంకేతిక ఇబ్బందులుగా మారాయి. ఆ తర్వాత రెండేళ్ల క్రితం చుంచుపల్లి, సుజాతనగర్‌ మండలాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేశారు. టెక్నికల్‌, ఫీజుబులిటీ సర్వే కోసం రూ.25 లక్షలు వెచ్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన టెక్నికల్‌ కమిటీ ప్రతిపాదిత స్థలానికి సమీపంలో ఎత్తైన కొండలు, వాగులు, వంకలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండోసారి నిరాశే ఎదురైంది.

దుమ్ముగూడెం మండలాన్ని తెరపైకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement