గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళిక.. | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళిక..

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించి నాణ్యమైన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ అంకిత్‌ అధ్యక్షతన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన , జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగలక్ష్మి, డీఆర్‌ఓ పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎం.సాయి, ఎంపీడీఓ సంకీర్త్‌, ఎంపీఓలు వీరారెడ్డి, సంధ్య శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement