● డిప్యూటీ కమిషనర్‌గా సోమిరెడ్డి ● ఏసీగా కిషన్ నియామకం
ఖమ్మంక్రైం: ఎకై ్సజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు అధికారులను బదిలీ చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధికారులకు సైతం స్థానచలనం కలిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా వి.సోమిరెడ్డిని నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నిజామాబాద్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తుండగా, పదోన్నతిపై ఖమ్మంకు కేటాయించారు. అలాగే, ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా రంగారెడ్డి ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న ఆర్.కిషన్‌ను నియమించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, అసిస్టెంట్ కమిషనర్ గణేష్‌ను హైదరాబాద్‌లోని డిస్టిలరీ అసిస్టెంట్ కమిషనర్‌గా, జిల్లా ఎకై ్సజ్ అధికారి జి.నాగేందర్‌రెడ్డిని పదోన్నతిపై ఎకై ్సజ్ ఎస్‌టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, డిప్యూటీ కమిషనర్‌గా నియమితులైన సోమిరెడ్డి గతంలో జిల్లా ఎకై ్సజ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కమిషనర్‌గా కిషన్ గురువారం బాధ్యతలు స్వీకరించగా ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


