రూ. 20 కోట్లు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

రూ. 20 కోట్లు మంజూరు చేయండి

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

మంత్రి దామోదర రాజనర్సింహకు

పీఓ విన్నపం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఏజెన్సీ పరిధిలో డాక్టర్ల కొరత తీర్చడానికి, పీహెచ్‌సీల నిర్మా ణం, వైద్య పరికరాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహల్‌ వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ భవనంలో వర్క్‌షాప్‌ నిర్వహించగా, పీఓ హాజరైన మాట్లాడారు. భద్రగిరి మార్ట్‌ పనితీరును వివరించగా మంత్రి ప్రశంసించారు. అనంతరం మంత్రికి గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్‌ ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సర్వేశ్వరరావు, ఏపీఓ డేవిడ్‌రాజ్‌, ఏడీఎంహెచ్‌ఓ సైదులు పాల్గొన్నారు.

28న చెస్‌ ఎంపికలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఐటీఐలో కల్నన్‌ సంతోష్‌ బాబు మెమోరియల్‌ ఆల్‌ ఇండియా ఫైట్‌ రేటింగ్‌ చెస్‌ పోటీలకు జిల్లాస్థాయిలో అండర్‌–10,13,15, అండర్‌–19 చెస్‌ ఎంపిక పోటీలు ఈ నెల 28న నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ గోపికృష్ణ, ప్రెసిడెంట్‌ చల్లా భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు బహమతులు కూడా ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.

ఎల్లప్పుడూ సిద్ధంగా

ఉండాలి

ఎస్పీ రోహిత్‌ రాజు

అశ్వాపురం: ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో సమర్థ స్పందనే లక్ష్యంగా సిద్ధం కావా లని ఎస్పీ రోహిత్‌ రాజు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలచెరువులో నిర్వహిస్తున్న జిల్లా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీడీఆర్‌ఎఫ్‌) శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను రక్షించేందుకు డీడీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. మణుగూరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, అశ్వాపురం సీఐ ఎల్లయ్య, ఎస్సై రాజేష్‌ పాల్గొన్నారు.

గౌరవంగా వ్యవహరించాలి

ములకలపల్లి: పోలీసులను ఆశ్రయించే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. బుధవారం ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌, ఆవరణ, సీజ్‌ చేసిన వాహనాలను పరి శీలించారు. పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తొలుత గౌరవ వందనంతో ఎస్పీకి స్థానిక పోలీసులు స్వాగతం పలికారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్‌, సీఐ సతీష్‌, ఎస్సై మధుప్రసాద్‌ ఉన్నారు.

ఆలయ నిర్మాణంపై విచారణ

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని తోగ్గూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఓ ఆలయ నిర్మాణంపై గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసూత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణాధికారిగా కొత్తగూడెం డివిజన్‌ దేవాదాయ శాఖ ఇన్‌స్సెక్టర్‌ కావూరి ఆనంద్‌ను నియమించారు. గురువారం ఆయన గ్రామంలో ఆలయ నిర్మాణంపై విచారణ చేపట్టారు. కాగా, ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించామని, నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణాధికారి తెలిపారు.

కడుపునొప్పితో

చిన్నారి మృతి

పాల్వంచరూరల్‌: కడుపునొప్పితో ఓ చిన్నారి బుధవారం మృతి చెందాడు. ఒడిశా నుంచి వల స వచ్చిన బాగు రాజేష్‌, సుమిత్ర దంపతులు మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామంలో క్వారీ ల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రుతిక్‌ కుమార్‌(6) తోగ్గూడెం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నా డు. రుతిక్‌ మంగళవారం ఉదయం నుంచి తీవ్రంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నయం కాకపోవడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement