పాఠశాలకు కొత్త విద్యార్థి! | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు కొత్త విద్యార్థి!

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జాతీయ పక్షి నెమలి బుధవారం సందడి చేసింది. ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు వచ్చిన సమయంలో మైదానంలో నెమలి గంతులేయడం చూసి ఆనందపరవశులయ్యారు. కోతులు వెంట పడటంతో నెమలిని రక్షించి తరగతి గదిలో ఉంచారు. ఆ తర్వాత ఎంఈఓ ఉమాశంకర్‌తో కలిసి నెమలిని అటవీశాఖ డీఆర్‌ఓ రాంసింగ్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ తారాసింగ్‌లకు అప్పగించారు. పక్కనే ఉన్న అర్బన్‌ పార్క్‌లో ఉన్న నెమలి ఎగిరి సమీపంలోని పాఠశాలలో వాలినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement