క్యూఆర్, బార్ కోడ్లు లేకపోవడంతో
శాంపిళ్ల సేకరణ
ఇల్లెందు: ఇల్లెందు జగదాంబసెంటర్‌లోని ఓ దుకాణంలో క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లేని రెండు కంపెనీల పత్తి విత్తనాలు అమ్ముతుండగా అనుమానంతో రైతులు మంగళవారం అధికారులకు సమా చారం ఇచ్చారు. దీంతో సీఐ తాటిపాముల సురేశ్ ఆధ్వర్యాన తనిఖీ చేపట్టారు. ఈ మేరకు పత్తి విత్తనాల ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడంతో ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీశ్ ద్వారా కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేయించారు. అంతేకాక విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షల కోసం పంపించారు.


