‘పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం’

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

కొత్తగూడెంఅర్బన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలోనే కాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ విఫలమైందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న విమర్శించారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ తదితర అంశాలపై మంగళవారం కొత్తగూడెంలో నిరసన తెలిపారు. తొలుత విద్యానగర్‌కాలనీ నుంచి సూపర్‌బజార్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించగా, అక్కడ మానవ హారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా దేవీప్రసన్న మాట్లాడుతూ.. విద్యార్థుల ఆశలను వమ్ము చేయకుండా, పేపర్‌ లీకేజీల బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక కేంద్రం విద్యార్థులకు క్షమాపణ చెప్పి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ సిరిపురం లలితకుమారి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్‌, కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల నాయకులు ప్రసన్న, ఆళ్ల మురళి, గద్దల రమేశ్‌, వై.శ్రీనివాస్‌రెడ్డి, హనుమంతు, జానీపాషా, ఎం.ప్రసాద్‌బాబు, పైడా రాజేంద్రప్రసాద్‌, లోశెట్టి నాగార్జున, నూకల రంగారావు, అంతోటి పౌల్‌, పరమేశ్‌ యాదవ్‌, భువనసుందర్‌ రెడ్డి, అజయ్‌కుమార్‌, సునీల్‌, దేవరగట్ల ప్రసాద్‌, సత్తిరెడ్డి, చింతలపూడి రాజశేఖర్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement