అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీఓ మధు హాజరై, ప్రజల నుంచి 21 అర్జీలు స్వీకరించారు.

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజల సమస్యల పరి ష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందనలతో కలిసి దరఖాస్తులను స్వీకరించా రు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఆర్‌డీఓ కార్యాలయంలో 21 ఫిర్యాదులు

వైద్యాధికారులతో ఆన్‌లైన్‌ సమావేశం

జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధి నిర్వహణ, ప్రధాన కార్యాలయ హాజ రు, సేవలపై సోమవారం కలెక్టర్‌ అంకిత్‌ ఆన్‌లైన్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది విధిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన మాతృ మరణ ఘటనల నేపథ్యంలో ప్రతీ వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలని, గర్భిణు ల పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు, రెఫరల్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ తుకారాం పాల్గొన్నారు.

జీవనోపాధి కల్పిస్తున్నాం

తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమంలో పలువురికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సీఈఓ దివ్య దేవరాజన్‌ సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, కలెక్టర్‌ అంకిత్‌ హాజరై మాట్లాడారు. గుండాల మండలంలో 800, దుమ్ముగూడెం మండలంలో 800, పినపాక మండలంలో 865, చర్ల మండలంలో 865 కుటుంబాలను గుర్తించామని, ఉపాధి, సంక్షేమం అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఓ విద్యాచందన, ఏపీఎం వెంకయ్య పాల్గొన్నారు.

మెనూ అమలు చేయాలి

బూర్గంపాడు: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకా రం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. బూర్గంపాడులోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీచేసి పరిశీలించారు. మెనూ అమలు చేయకపోతే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల చేరికలపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మోరంపల్లిబంజరలోని విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్‌, ఫెస్టిసైడ్‌ దుకాణాల్లో విక్ర య వివరాలను పారదర్శకంగా స్టాక్‌ బోర్డ్‌ల్లో తెలపాలన్నారు. తహసీల్దార్‌ కేఆర్‌కేవీ ప్రసాద్‌, డీటీ సమ్మయ్య, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఓ శంకర్‌, ప్రిన్సిపాల్‌ నాగజ్యోతి పాల్గొన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్‌ అంకిత్‌

సర్‌పై పూర్తి అవగాహన ఉండాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)–2026 ప్రక్రియపై పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, ఏఎల్‌ఎంటీలు, మండల ఆపరేటర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌ మాట్లాడుతూ సర్‌ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్‌ సాయి కృష్ణ, అధికారులు రంగా ప్రసాద్‌, రవీంద్రనాథ్‌, ఆర్డీఓ మధు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement