కనుల పండువగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా రామయ్య కల్యాణం

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం కనుల పండువగా స్వామివారి నిత్యకల్యాణం జరిగింది. తొలుత తెల్లవారుజాము న గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి : పీఓ

భద్రాచలం: గిరిజనుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహు ల్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్‌లో అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందేలా పారదర్శకంగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు శాఖలు సమన్వయంతో పని చేయాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. కాగా వీలై చైర్‌పై వచ్చిన దివ్యాంగ చిన్నారిని గమనించిన పీఓ అక్కడే దరఖాస్తును స్వీకరించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్‌ రాజ్‌, ఆనంద్‌ కుమార్‌, అశోక్‌, మధుకర్‌, సైదులు, సమ్మ య్య, రాంబాబు, ఉదయ్‌కుమార్‌, వేణు, గన్యా, మనిధర్‌, హేమంత్‌ పాల్గొన్నారు.

‘యాంటీ డ్రగ్‌’

పోస్టర్లు ఆవిష్కరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): యాంటీడ్రగ్‌ అవేర్‌నెస్‌ పోస్టర్లను ఎస్పీ రోహిత్‌ రాజు సోమవా రం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పోస్టర్లు, బ్యానర్లు, యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌ సెల్ఫీ పాయింట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 26 వరకు పాఠశాలలు, కళాశాలలు, పట్టణాలు, గ్రామాల్లో మా దక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, వినియోగించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడ్మిన్‌ ఆర్‌ఐ లాల్‌బాబుపాల్గొన్నారు.

భూ చట్టాలపై

అవగాహన ఉండాలి

భద్రాచలంఅర్బన్‌: ఏజెన్సీ భూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రైతు, వ్య వసాయ కమిషన్‌ సభ్యుడు భూమి సునీల్‌ కుమార్‌ సూచించారు. ఏజెన్సీ చట్టాలు, భూ సమస్యలు, భూ భారతి చట్టంపై సోమవారం భద్రాచలంలోనిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. ఏజెన్సీలో మొబైల్‌ కోర్టు నడవకపోవడం వల్ల కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంలో అనేక సమస్యలు ఉండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని అన్నారు. భద్రాచలం సర్పంచ్‌ పూనం కృష్ణ, భద్రాచలం ఆదివాసీ సమితి, ఆది వాసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు పాయం రవి వర్మ, చీమల నరసింహారావు, పాపారావు, వాసం ఆనంద్‌ కుమార్‌, పూనెం వీరభద్రం, కుంజా ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement