యంత్రాల పని గంటలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యంత్రాల పని గంటలు వినియోగించుకోవాలి

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

ఇల్లెందు/మణుగూరు టౌన్‌/టేకులపల్లి: యంత్రా ల పనిగంటలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవా లని సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎల్‌వీ సూర్యనారాయణ, డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎం.తిరుమల రావు అన్నారు. సోమవారం డైరెక్టర్‌ సూర్యనారా యణ మణుగూరు కేసీహెచ్‌పీ, ఓసీ–2 గనులను సందర్శించారు. క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవా ణా ప్రక్రియను ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. డైరెక్టర్‌ తిరుమల రావు కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ (కేఓసీ)ని సందర్శించారు. వ్యూ పాయింట్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు తదితర పనులను పరిశీలించారు. టీసీ పాయింట్లు, వే బ్రిడ్జిలు, చెక్‌పోస్టులు, బొగ్గు నిల్వ ప్రదేశాలను తనిఖీ చేశారు. యంత్రాల పని తీరుపై జనరల్‌ మేనేజర్‌ వి.కృష్ణయ్యతో సమీక్ష నిర్వహించారు. ఇల్లెందులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషిచేయాలన్నారు. వానాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బొగ్గురవాణా వాహనాలను వాహ న ట్రాకింగ్‌ వ్యవస్థలు, జియో ఫెన్సింగ్‌ సాంకేతికత ద్వారా నిరంతరం ట్రాక్‌ చేస్తున్నట్లు డైరెక్టర్లు తెలిపా రు. భద్రత, పర్యవేక్షణ, డిజిటల్‌ నియంత్రణ వ్యవస్థలతో పారదర్శకంగా రవాణా చేస్తున్నట్లు తెలిపా రు. సింగరేణిలో బొగ్గు మాయమైందని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు శ్రీనివాసరావు, ఎం.చిన్నయ్య, చైతన్య, రాజేష్‌ జాకీర్‌ హుస్సేన్‌, ప్రభాకర్‌రావు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి డైరెక్టర్‌ సూర్యనారాయణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement