ఆలస్యానికి పలు కారణాలు
రెండేళ్ల ప్రయత్నాలు సఫలం..
ప్రారంభానికి ఏర్పాట్లు
గతంలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో భవనం గర్తింపులో ఆలస్యం
రూ.4 కోట్లతో వైద్య పరికరాల
కొనుగోలుకు చర్యలు
త్వరలోనే ప్రారంభిస్తాం..
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలోని టీ–హబ్ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభానికి వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. వైద్యాధికారుల రెండేళ్ల ప్రయత్నాలు సఫలమవగా త్వరలోనే సెంటర్ షురూకానుంది. అయితే, భద్రాచలంలో టీ–హబ్ ఏర్పాటు చేయాలని 2024 జన వరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏల (భద్రాచలం, ఉట్నూర్, ఏటూరునాగారం, మన్ననూర్) పరిధిలో నూతనంగా టీ–హబ్ డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీచేసింది. ఏటూ రునాగారం, ఉట్నూర్‌లో భవనాలు నిర్మించి, ప్రా రంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ, భద్రాచలంలో ఆ పరిస్థితి లేదు. 2024 జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోనే అదే ఏడాది జనవరి 17న రాష్ట్ర వైద్య బృందం భద్రాచ లం ఏరియా ఆస్పత్రిని సందర్శించి, కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు, ఇతర అంశాలను పరిశీలించాలని పేర్కొంది. కానీ, వైద్యబృందం పర్యటన రద్దయింది. ఇదే వైద్య బృందం తిరిగి అదేనెల 22వ తేదీ లేదా 23న వస్తుందని అధికారులు చెప్పనప్పటికీ రాలేదు.
నూతన పరికరాల కొనుగోలు
ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న టీ–హబ్‌లో వినియోగించే పరికరాలు, టీఫా స్కానింగ్ యంత్రంతోపాటు సుమారు రూ.కోటి లేదా కోటిన్నర ఖర్చుతో సీటీ స్కాన్ యంత్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. అవకాశం ఉంటే ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం కూడా అందుబాటులోకి తేనున్నారు.
సకాలంలో చికిత్స
ఏరియా ఆస్పత్రిలో 200 పడకలు ఉన్నాయి. టీ–హబ్ ఏర్పాటుతో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కాలేయం, మూత్ర పిండాల పనితీరు, షుగర్, థైరాయిడ్, మూత్రం పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే లాంటివి వైద్యుల సూచనల ప్రకారం చేయాలి. వీటిల్లో కొన్ని ఇక్కడ చేసి, మిగ తావి కొత్తగూడెం హబ్‌కు పంపుతున్నారు. టీ–హబ్ ఇక్కడే ఉంటే అన్నిరకాల పరీక్షలు నిర్వహించవచ్చు. సకాలంలో చికిత్స అందించవచ్చు.
సిబ్బందిని నియమించాలి..
నూతనంగా ఏర్పాటు చేయాల్సిన టీ–హబ్ కేంద్రానికి మేనేజర్‌తోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు–6, డేటా ఎంట్రీ ఆపరేటర్–1, ల్యాబ్ సిబ్బంది ఇద్దరిని కొత్తగా నియమించాల్సి ఉంది. ఇప్పటికే 10 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్య బృందం త్వరగా సందర్శించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరలో ఏజెన్సీ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
టీ–హబ్ ఏర్పాటుకు విశాలంగా ఉండే భవనం కావాల్సి ఉంది. ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఉన్న భవనాలు అన్నీ ఉపయోగంలోనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీ–హబ్ కోసం రూ.90 లక్షలు కేటాయించారు. ఆ నిధులు కేవలం పరికరాలకే సరిపోతాయి. భవన నిర్మాణం సాధ్యంకాకపోవడంతో నిధుల ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలో పాత క్యాంటీన్ భవనంలో టీ–హబ్ ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించి, రూ.90 లక్షలతో మరమ్మతులు చేయించి, ప్రారంభానికి సిద్ధం చేశారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయ నున్న టీ–హబ్ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ముందస్తుగా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏజెన్సీ ప్రజల సౌకర్యార్థం భద్రాచలంలో టీ–హబ్ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా దీనిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ సైదులు,
అడిషనల్ డీఎంహెచ్‌ఓ, భద్రాచలం


