మణుగూరురూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీవీకాలనీలో ఎద్దు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏరియాలోని పీకేఓసీ–2లో పంప్ సెక్షన్‌లో పనిచేస్తున్న వినోద్‌కుమార్ భార్య సంధ్యపై ఇంటి సమీపంలో ఎద్దు దాడి చేయడంతో గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకట్ ఆమెను పరామర్శించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. సీతారాంపురంలో నివాసం ఉండే వజ్జా దుర్గారావు (36) ఇంట్లో ముఖం కడుక్కొని దండెంపైన ఉన్న కండువా తీయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
చెట్టు విరిగి పడగా
వ్యక్తికి గాయాలు
టేకులపల్లి: మండలంలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇమ్రాన్ సోమ వారం ప్రమాదానికి గురయ్యారు. విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా బలంగా వీచిన ఈదురుగాలులకు చెట్టు విరిగి అతడి బైక్‌పై పడింది. ఇమ్రాన్‌కు స్వల్ప గాయాలుగా కాగా, సింగరేణి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దాడి ఘటనపై కేసు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్‌నగర్‌కాలనీకి చెందిన వేముల రామకృష్ణపై గొట్టాల రామకృష్ణ అకారణంగా దాడి చేసి గాయపరిచాడు. బాధితు డు సోమ వారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఐటీ డీఏ రోడ్డులో నివాసముంటున్న గొట్టాల రామకృష్ణ, వేముల రామకృష్ణ ఫొటో స్టూడియోలు నిర్వహిస్తున్నారు. నగదు లావాదేవీల విషయంలో ఇటీవల ఏర్పడిన మనస్పర్దలతో గొట్టాల రామకృష్ణ.. వేముల రామకృష్ణపై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.


