పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్‌పై నుంచి జలాశయాన్ని వీక్షించారు. జంగల్ సఫారీ టూర్ వాహనంలో ప్రయాణించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. 546 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌కు రూ.23,515 ఆదాయం లభించింది. సఫారీ వాహనంలో 104 మంది ప్రయాణించగా రూ.9,200 ఆదాయం, 250 మంది బోటింగ్ చేయగా రూ.14,280 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.


