భద్రాచలం: యోగా సాధనతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ, అధికారులు డేవిడ్ రాజ్, మధుకర్, చందన, ఆనంద కుమార్, శ్రీధర్, ఉదయ్ కుమార్, వేణు, సున్నం రాంబాబు, అశోక్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అలవాటుగా మార్చుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): యోగాను అలవాటుగా మార్చుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. డీఎస్పీలు ఆదినారాయణ, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ ఆధ్వర్యంలో..
చుంచుపల్లి: కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఆది వారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ యోగా సాధానతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, సిబ్బంది ప్రతాప్, సుందర్, ఝాన్సీ రామ్, మోహన్,రామ్ ప్రసాద్, అజయ్ పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్


