రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు.

జగన్‌ మళ్లీ సీఎం కావాలని..

దుమ్ముగూడెం: వైఎస్సార్‌ సీసీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావా లని ఆకాంక్షిస్తూ జగన్‌ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్‌ శనివారం పర్ణశాల రామయ్యను దర్శించుకున్నారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ తెలంగాణలోని 100 దేవాలయాలను సందర్శించి 10,101 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తానని ప్రవీణ్‌ తెలిపాడు.

వార్షిక లక్ష్యాలను అధిగమించాలి

సింగరేణి డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు

టేకులపల్లి: బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్‌ (ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) కే. వెంకటేశ్వర్లు అన్నారు. ఇల్లెందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఉపరితల గనిని శనివారం ఆయన సందర్శించారు. గని వ్యూ పాయింట్‌ నుంచి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవా ణా ప్రక్రియతోపాటు ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు, లోడింగ్‌ పనుల పురోగతిని ఏరియా జీఎం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు ఆటంకాలు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు బి.మాధవరావు, జాకీర్‌ హుస్సేన్‌, శ్రీనివాస రావు, రామదాసు, బ్రహ్మం, ఎస్‌.రాజేష్‌ పాల్గొన్నారు.

బీజేపీని

బలోపేతం చేయాలి

చుంచుపల్లి: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రాష్ట్ర కార్యదర్శి కర ణం సాయి పరిణితి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమైందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. నాయకులు కేవీ రంగా కిరణ్‌, కుంజా ధర్మా, పొడియం బాలరాజు, కార్పొరేటర్‌ చెరుకు భాగ్యలక్ష్మి, పుణ్యం భిక్షపతి, వెంకన్న, భోగి కృష్ణయ్య, భూక్య దివ్యశ్రీ, మోహన్‌ కృష్ణ, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement