కొత్తగూడెంఅర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సింగరేణి ప్రధా న కార్యాలయంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. తొలుత కళాకారిణి సీతాప్రసాద్ నృత్య బృందం యోగాపై అవగాహన కల్పించింది. అనంతరం యోగా ప్రతిజ్ఞ చేశారు. జీఎంలు జీవీ కిరణ్‌కుమార్, వెంకట రమణ, పి.ఎలిషా, ఏజేఎంమురళీదరరావు, నాయకులు ఎస్‌వి.రమణ మూర్తి, పీతాంబర రావు, ఎస్.వెంకటాచారి, డీజీఎం(పర్సనల్) కేసా నారా యణరావు, బి.శివ కేశవరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్లలో, ఆర్‌సీఓఏ క్లబ్‌లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. జీఎం ఎం.శాలేంరాజు, ఎం.గోవిందరావు, యూనియన్ నాయకులు కత్తెర్ల రాములు, ఎండీ. రజాక్, ఇతర అధికారులు ఉపేందర్‌రావు, ఎల్. తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


