లోక్‌ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజ లు తమ వివాదాలను సత్వరంగా, సులభంగానే కాకుండా తక్కువ ఖర్చుతో పరి ష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం మోటారు వాహన ప్రమాద కేసుల్లో రాజీకుదిరిన బాధితులకు అవార్డు కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌, కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.కిరణ్‌కుమార్‌, న్యాయవా దులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

కొత్తగూడెంలో 1720 కేసులు పరిష్కారం

కొత్తగూడెంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 23 సివిల్‌ కేసులు, 7 మోటార్‌ వాహన ప్రమాద కేసులు, 1105 క్రిమినల్‌ కేసులు, 169 పీఎల్‌సీ కేసులు, 169 సైబర్‌ క్రైమ్‌ కేసులు, 360 ట్రాఫిక్‌ చలాన్లు.. మొత్తం 1720 కేసులు పరిష్కారమయ్యాయి. ఇల్లెందులో 807, భద్రాచలంలో 1243, మణుగూరులో 801, దమ్మపేటలో 750 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement