టేకులపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే కాక, లక్ష్యాలను గడువులోగా చేరేలా అధికారులు పర్యవేక్షించాని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేసిన ఆమె రికార్డుల పరిశీలన అనంతరం జీపీల కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చెల్లింపులు, వనమహోత్సవం, ఉపాధి హామీ పథకం పనులు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీఓ విక్రమ్, ఉపాధి హామీ పథకం ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తిరుపతి పాల్గొన్నారు.


