విద్యార్థుల
హాజరు
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో సోమవారం నుంచి విద్యార్థుల హాజరు వంద శాతం నమోదు కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రధానోపాధ్యాయులు, వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ హెచ్చరించారు. శనివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల కల్పనపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలలో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. భద్రగిరి మార్ట్‌లో వినియోగదారుల డిమాండ్‌కు తగినట్లుగా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని పీఓ రాహుల్ సూచించారు. శనివారం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉత్తమ ఐటీడీఏ పీఓగా ఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డును అందుకున్నందుకు టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాహుల్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు చందన, విజయలక్ష్మి, మధుకర్, సమ్మయ్య, రమేష్, అశోక్ , అసోసియేషన్ బాధ్యులు యుగంధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్, అన్నం వెంకటేశ్వర్లు, వాసు, కబీర్, వీర నాయక్, జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి ఉండాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలపైనా మక్కువ కలిగి ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శని వారం మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, లైబ్రరీ, డైనింగ్ హాల్, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. బడిబాట కార్యక్రమంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. వంటగది రోజూ శుభ్రం చేయాలని, మెనూ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం చిన్న ఆర్లగూడెం కొంగవాగు గుంపు జీపీఎస్ పాఠశాలలను పరిశీలించి పిల్లలతో ఉద్దీపకం వరకు బుక్‌లోని అంశాలను చదివించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సోమశేఖర్, వార్డెన్ లక్ష్మణరావు, ఎస్సీఆర్ పి విఠల్, జీపీఎస్ పాఠశాల హెచ్‌ఎంలు పాపారావు, కన్నారావు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


