గంజాయి, నాటుసారా స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గంజాయి, నాటుసారా స్వాధీనం

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఎండు గంజాయి, నాటుసారా పట్టుబడ్డాయి. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ సీహెచ్‌ శ్రీహరిరావు బృందం కూనవరం – భద్రాచలం రహదారిలోని ఇసుక రీచ్‌ వద్ద శనివా రం తనిఖీలు నిర్వహించారు. నంబర్‌ ప్లేట్‌ లేని పల్సర్‌ బైక్‌పై తరలిస్తున్న 21.100 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని, మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద హీరో గ్లామర్‌ బైక్‌పై మూడు క్యాన్లలో తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, సారాతో పాటు రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసును భద్రాచలం ఎకై ్సజ్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ వెల్లడించారు. తనిఖీల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ ఖలీల్‌ అహ్మద్‌, శివకుమార్‌, వీరబాబు, తిరుపతి, ఉపేందర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడులో విద్యుదాఘాతంతో మూడు పాడి గేదెలు మృతిచెందాయి. శుక్రవారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురుగాలుల కారణంగా గ్రామ శివారులోని విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. గోదా వెంకటేశ్వర్లుకు చెందిన మూడు పాడి గేదెలు శనివారం ఉదయం మేతకు విద్యుత్‌ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాయి. ఆర్థికంగా నష్టపోయానని, పరిహారం అందించాలని రైతు వెంకటేశ్వర్లు కోరాడు.

పిడుగుపాటుతో పశువులు..

జూలూరుపాడు/టేకులపల్లి: జూలూరుపాడు కాకర్లలో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా.. కాకర్లకు చెందిన చావా కృష్ణయ్య రైతుకు చెందిన గేదైపె పిడుగుపడటంతో మృతి చెందినది. సుమారు రూ.70 వేలు నష్టం వాటిల్లిందని, పరిహారం అందించాలని రైతు కృష్ణయ్య విజ్ఞప్తి చేశాడు. అలాగే, టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన పూనెం నర్సయ్య ఎద్దుపై పిడుగుపడటంతో మృతిచెందింది. సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సునీత, వెటర్నరీ డాక్టర్‌ పూర్ణచందర్‌, జీపీఓ కన్నయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement