పాల్వంచరూరల్: ఆరేళ్ల కిందట మూసివేసిన బడిని గతేడాది తెరిచారు. ఆనాడు ఐదుగురు విద్యార్థులు వచ్చారు. ఈ ఏడాది ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు వస్తున్నాడు. ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయినితో పాఠశాల నడుస్తోంది. పాల్వంచ మండ లం నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని బోజ్యా తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇందులో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్నాయి. 20మంది వరకు విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లతో కొనసాగింది. క్రమంగా విద్యార్థులు తగ్గడంతో పాఠశాల 2019లో మూతబడింది. ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్‌పై ఇతర స్కూళ్లకు బదిలీచేశారు. స్థానికుల ఆందోళనలతో ఆరేళ్ల తర్వా త స్థానికులు ఆందోళన చేయడంతో 2025లో పాఠ శాలను తెరిచారు. గతేడాది ఐదుగురు విద్యార్థులుండగా.. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఒక విద్యార్థి హాజరవుతున్నా డు. మిగిలినవారిలో గ్రామానికి కిలోమీటర్ దూరంలోని నాగా రం హైస్కూల్‌కు ముగ్గురు, పాల్వంచలోని ప్రైవేట్ స్కూల్‌కు మరో ఇద్దరు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులతో ఎంఈఓ శ్రీరాంమూర్తి మాట్లాడినా వారు రావ డం లేదు. ఐదేళ్ల విద్యార్థి వస్తుండగా.. టీచర్ గీత ఆ విద్యార్థికే బోధిస్తోంది. అతడిని కూడా సమీపంలోని నాగారం పాఠశాలలో చేర్చాలని యత్నించినా స్థానికులు అభ్యంతరం తెలపడంతో ఉపాధ్యాయిని విధు లు నిర్వర్తించక తప్పడం లేదు.
మూసిన బడిని తెరిచినా ఫలితం శూన్యం


