అశ్వాపురం: మండలంలోని మొండికుంట శివారులో అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యా యి. ఇసుక లోడ్‌తో లారీ కొత్తగూడెం వైపు వెళ్తుండగా మొండికుంట శివారులో పాలవాగు సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. లారీడ్రైవర్ శంకర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా అవస్థ పడ్డాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో అశ్వాపురం వైపు వస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగి వివరాలు తెలుసుకొని ఐటీసీ అధికారులతో మాట్లాడి రెస్క్యూ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి డ్రైవర్‌ను బయటకు తీసి, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్‌కు తీవ్రగాయాలు


