ఉపాధ్యాయుడిపై వైద్యుడి దాడి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై వైద్యుడి దాడి

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

చర్ల: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (ప్రభుత్వ వైద్యశాల)లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు ఉపాధ్యాయుడిపై దాడిచేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వివరాలి లా ఉన్నాయి. చర్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పలకా నాగేశ్వరరావు వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి, బైక్‌ను దారికి అడ్డంగా పెట్టాడు. దానిని తీయమని వైద్యశాలలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్‌ సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో నాగేశ్వరరావుకు, సెక్యూరిటీ గార్డుకు మధ్య గొడవ జరుగుతండడంతో కృష్ణ ప్రసాద్‌ అక్కడికి వెళ్లగా వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో కృష్ణప్రసాద్‌ నాగేశ్వరరావుపై చేయి చేసుకోగా ఇరు వర్గాలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. రంగంలోకి దిగిన ఉద్యోగ, గిరిజన సంఘాల నాయకులు ఇరువురికి సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

గర్భిణి మృతి

చంద్రుగొండ: పిండాన్ని తొలగించాలని వైద్యులు చేసిన సూచనను పాటించని గర్భిణి అనారోగ్యానికి గురై మృత్యువాత పడిన ఘటన మండలంలో బెండాలపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారం భవాని (30) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె గర్భం దాల్చగా.. వైద్యులు పిండాన్ని తొలగించాలని సూచించారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో 6 నెలల గర్భవతిగా ఉన్న భవాని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి ఇప్పటికే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement