టేకులపల్లి: అవగాహనతో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ అన్నారు. ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ కోసం జన్యు పరీక్షల శిబిరం నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,80,700 మందికి పీఓసీ పరీక్షలు నిర్వహించి, 3,450 మంది క్యారియర్లు, 687 మంది బాధితులను గుర్తించామని తెలిపారు. 6,341 మందికి హెచ్‌పీఎల్‌సీ పరీక్షలు నిర్వహించగా 1,900 మంది క్యారియర్లు , 135 మంది సికిల్ సెల్ బాధితులు ఉన్నట్లు నిర్ధారించామని స్పష్టం చేశారు. సికిల్ సెల్ అనీమియాను ప్రాథమిక దశలో గుర్తిస్తే బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కందుల దినేష్, వైద్యులు కంచర్ల వెంకటేష్, మనిషా, పుణ్యశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారులు రాంప్రసాద్, హరి కిషన్, దేవా, పున్నమయ్య, రంజిత్ పాల్గొన్నారు.
ముందస్తుగా గుర్తిస్తే ప్రభావాన్ని
తగ్గించుకోవచ్చు
పాల్వంచరూరల్: జన్యు పరమైన వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే వాటి ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ అన్నారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అధ్యాపకులు మాధవి, శ్రీదేవి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ తుకారాం


