డీఈఓ నాగలక్ష్మి
కొత్తగూడెంఅర్బన్: గ్రంథాలయం జ్ఞానానికి నిలయమని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారో త్సవాల్లో భాగంగా శుక్రవారం లైబ్రరీ డే నిర్వహించారు. కొత్తగూడెంలోని పీఎంశ్రీ జీహెచ్‌ఎస్ కూలీ లైన్ పాఠశాలను డీఈఓ సందర్శించి గ్రంథాలయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మనిషి జీవితాన్ని మార్చగల శక్తి పుస్తకాల్లో ఉంటుందన్నారు. పుస్తక పఠనం వల్ల చరిత్ర, విజ్ఞానం, సాహిత్యం, సంస్కృతి, నైతిక విలువలు వంటి అనేక అంశాలను తెలుసుకోవచ్చ ని అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవా టు చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఎంఈఓ బి.మధురవాణి, పాధ్యాయులు పాల్గొన్నారు.


