గురుకుల కళాశాలప్రవేశ పరీక్షకు స్పందన | - | Sakshi
Sakshi News home page

గురుకుల కళాశాలప్రవేశ పరీక్షకు స్పందన

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

పాల్వంచరూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన టీజీఎస్‌డబ్లూఆర్‌జేసీ సెట్‌–2026 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 1,014 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. పాల్వంచ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 408 మంది విద్యార్థులకు గాను 358 మంది విద్యార్థులు హాజరుకాగా, 50 మంది గైర్హాజరయ్యారు. అన్నపురెడ్డిపల్లి గురుకుల కళాశాల సెంటర్‌లో 377మంది గాను 312 మంది విద్యార్థులు హాజరు కాగా, 65 మంది హాజరుకాలేదు. దమ్మపేట గురుకుల కళాశాల సెంటర్‌లో 432 మంది గాను 344 మంది హాజరుకాగా 88 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement