మమ్మీ, డాడీ ఈ సెలవుల్లో సైకిల్ కొనిచ్చారు. దీంతో తొలుత డాడీ సాయంతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగానే సైకిల్ తొక్కగలుగుతున్నా. అయినా రోడ్లపైకి వెళ్లకుండా ఉదయం, సాయంత్రం వీధిలోనే ప్రాక్టీస్ చేస్తున్నా. సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం సైకిల్ తొక్కుతుండగా.. స్కూల్‌కు కూడా ఈసారి సైకిల్‌పైనే వెళ్తాను.
–అంజన్‌కుమార్, బెస్తకాలనీ, శ్రీనివాసనగర్, ఖమ్మం
సైకిళ్లపై క్రేజీ ఎన్నటికీ తగ్గదు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సైకిల్‌పై మోజు చూపుతున్నారు. నడక నేర్చుకునే పిల్లల నుంచి అన్ని వయసుల వారికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు మోడళ్లు లభిస్తాయి. వేసవి సెలవులు మొదలు స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.
–అబ్దుల్ హమీద్, సైకిల్ స్టోర్స్, కస్బాబజార్, ఖమ్మం


