భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని పలు హోట ళ్లు, బిర్యానీ పాయింట్లలో ఆహార భద్రత శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్ర త, వంటశాలల నిర్వహణ, నిల్వ విధానాలు, లైసెన్సుల అంశాలను ఆహార భద్రత అధికారి శరత్ పరిశీలించారు. పలువురు లైసెన్సులు లేకుండా హోటళ్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారంలోగా లైసెన్సులు పొందాలని సూచించారు. ప్రాంగణాలు, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచుతూ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత లోపాలు గుర్తించిన హోటళ్లకు వారం గడువు ఇచ్చి.. మరోమారు తనిఖీలు చేపడతామని శరత్ వెల్లడించారు. కాగా, 3 యాక్ట్ నమూనాలు, 9 సర్వైలెన్స్ నమూనాలు సేకరించి ప్రయోగశాలకు విశ్లేషణ నిమిత్తం పంపించినట్లు ఆయన వివరించారు.


