ఘర్షణకు దారితీసిన భూవివాదం | - | Sakshi
Sakshi News home page

ఘర్షణకు దారితీసిన భూవివాదం

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

ఎనిమిది మందికి గాయాలు.. కేసు నమోదు

అశ్వారావుపేటరూరల్‌: ఇరువర్గాల మధ్య నెలకొన్న భూవివాదం తాజాగా ఘర్షణకు దారితీయగా ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. అందు లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని తోగ్గూడెం శివారలోని సాగు భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన కుర్సం రాజులు, పొట్టా పాపారావు మధ్య కొంతకాలంగా వివాదం ఉంది. కాగా, కుర్సం రాజులు ఆధీనంలో ఉన్న ఐదెకరాల భూమి తమదేనని పాపారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విషయంపై ఇరు వర్గాలు న్యా యస్థానాన్ని ఆశ్రయించగా, పరిష్కారం కాలేదు. శుక్రవారం ఉదయం రాజులు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాదంలో ఉన్న పొలంలో జామాయిల్‌ చెట్లను నరికి విక్రయించేందుకు వెళ్లగా, విషయం తెలుసుకున్న పాపారావు కుటుంబీకులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించడంతో తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో కుర్సం రాజులుకు తీవ్రగాయాలు కాగా, వీర్రాజు, గోపాల్‌రావు, దినేశ్‌, సునీల్‌, జగదీశ్‌లు స్వల్పంగా గాయపడ్డారు. రాజులు పరి స్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తర లించారు. పాపారావు, రాజశేఖర్‌ కూడా గాయపడటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

మణుగూరుటౌన్‌: మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయతీ బోడేపూడినగర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి మామిడి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బోడేపూడినగర్‌కు చెందిన సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకుడు మల్లెల రామయ్య (42) మామిడి చెట్టు ఎక్కి కొమ్మ లు నరుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, రామయ్య మృతదేహంవద్ద ప్రజా పంథా, ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) నాయకులు నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, మాజీ సర్పంచ్‌ కారం ముత్తయ్య, సీపీఐ నాయకుడు సరెడ్డి పుల్లారెడ్డి సైతం సంతాపం తెలిపారు.

వడదెబ్బతో వృద్ధుడు..

దమ్మపేట: వడదెబ్బ కారణంగా వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని అర్బన్‌కాలనీ లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. దమ్మపేటలోని అర్బన్‌కాలనీకి చెందిన సోయం రామ్మూర్తి (66) తన ఇంట్లోనే కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement