తెలిసిన నిజం.. | - | Sakshi
Sakshi News home page

తెలిసిన నిజం..

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

నేను రాసిన కథ

సత్తుపల్లిటౌన్‌: రామాపురం అనే గ్రామంలో స్నేహితులు రాజు, రాము ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ బహుమతులు గెలిచేవారు. ఓసారి రాజు రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలు ఎంపికయ్యాడని తెలిసి రాము సంతోషించాడు. కానీ అదే పాఠశాలలో చదువుతున్న సోముకు ఇది నచ్చలేదు. రాజుతో స్నేహం పెంచుకుని పిజ్జా, బర్గర్‌ వంటివి కొనిచ్చేవాడు. ఇది గమనించిన రాము.. రాజును కలిసి జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం మంచిది కాదని హెచ్చరించాడు. కానీ సోము మాత్రం తనతో స్నేహాన్ని రాము తట్టుకోవడం లేదని చెబుతూ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాడు. ఒకరోజు వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, మరికొందరితో ఖో–ఖో సాధన చేయిస్తున్నాడు. సోము కూడా అందులో పాల్గొన్నాడు. కొన్నాళ్లుగా జంక్‌ ఫుడ్‌ తింటున్న రాజు బరువు పెరిగి వేగంగా పరిగెత్తలేక కడుపునొప్పితో కిందపడిపోయాడు. అప్పుడు సోము.. జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్లే పరిగెత్త లేకపోతున్నావు, ఇలా జరగాలనే తాను జంక్‌ఫుడ్‌ అలవాటు చేయించానని చెప్పాడు. దీంతో రాము తన స్నేహితుడు రాజు పరిస్థితి చూసి బాధతో కుంగిపోయాడు. ఆ వెంటనే రాజును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కొన్నాళ్లకు రాజు కోలుకోగా.. తన తప్పు తెలుసుకోవడమేకాక జంక్‌ఫుడ్‌ మానేసి వ్యాయామ ఉపాధ్యాయుడు, రాము సాయంతో ఖో–ఖో మరింత సాధన చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. అంతేకాక జంక్‌ఫుడ్‌తో ఎదురయ్యే నష్టాలను మరికొందరికి వివరించి దానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు.

నీతి: స్నేహితులు, శతృవులు ఎవరో గుర్తించి అందుకు అనుగుణంగా మెదిలితే కష్టాలు దరిచేరవు.

Advertisement
 
Advertisement
Advertisement