ఆలయ నిర్మాణం కోసం విరాళం.. | - | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణం కోసం విరాళం..

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన కాటిబోయిన ఆనంద్‌కుమార్‌ రూ. 1,00,001లను చిన్న అరుణాచల ఆలయ వ్య వస్థాపకుడు శివనాగస్వామికి విరాళంగా శుక్రవారం అందజేశారు. గ్రామంలోని పురాతన కోదండరామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల కూల్చివేశారు. అనంతరం అక్కడ నూతన ఆల యం నిర్మిస్తుండటంతో ఆనంద్‌కుమార్‌ విరా ళం అందించగా గ్రామస్తులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తికి గాయాలు

అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమినగర్‌కాలనీ గేటు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉమాశంకర్‌ బైక్‌పై వెళ్తుండగా గౌతమీనగర్‌కాలనీ గేట్‌ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. గాయపడిన ఉమాశంకర్‌ను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

మట్టి కుప్పను ఢీకొట్టిన వాహనదారుడికి..

పాల్వంచ: మిషన్‌ భగీరథ పైపులైన్ల కోసం తీసి ఉంచిన మట్టి కుప్పలను ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం రాత్రి పాల్వంచ నుంచి నవభారత్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషా.. స్పాంజ్‌ ఐరన్‌ కంపెనీ ఎదురుగా మూలమలుపు వద్ద మట్టి కుప్పను గమనించక ఢీకొట్టాడు. స్థానికులు గమనించి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.

పామాయిల్‌ తోటలో

గుప్తనిధుల తవ్వకాలు?

ములకలపల్లి: మండలంలోని పొగళ్లపల్లి శివారులోని ఓ పామాయిల్‌ తోటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. భారీగా బంగారం తదితరాలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. భారీ వాహనాలతో తవ్వకాలు చేపడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. భారీగా డంప్‌ బయట పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాటాల పంపిణీ విషయంలో నెలకొన్న వివాదంతో విషయం బయటకు పొక్కినట్లు సమాచారం. నిమ్మకాయలు, అరటిపళ్లు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నాయి. పోలీసులు విచారణ చేపట్టి ఓ వ్యాపారి, మరో ఏడుగురిని అదుపు లోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయంపై ఎస్‌ఐ మధుప్రసాద్‌ను వివరణ కోరగా.. గుప్తనిధులు తవ్వినట్లు సమాచారం లేదని, పోటీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అయినా సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement