పాల్వంచ: ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీల్లో కేటీపీఎస్ ఉద్యోగి మల్లూరి నవీన కుమార్తె మానసశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అంతేగాక హైదరాబాద్‌లో నిర్వహించిన కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చి 2 బంగారు, ఒక కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా సీఈ జె.సూర్యనారాయణ శుక్రవారం విద్యార్థినిని అభినందించారు.
అగ్నికి ఆహుతైన షావెల్
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2లో ప్రమాదవశాత్తు ఓ షావెల్ దగ్ధమైంది. శుక్రవారం రెండో షిఫ్ట్‌లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అధికారులను, కార్మికులను భయాందోళనకు గురిచేసింది. ప్రకాశంగని ఓపెన్‌కాస్ట్–2లో 700 ఆర్‌ఎల్ పని ప్రదేశంలో పనులు నిర్వహిస్తున్న బ్రహ్మపుత్ర 5 క్యూబిక్ మీటర్ షావెల్‌కు సాయంత్రం ఐదు గంటల సమయంలో సాంకేతిక లోపంతో నిప్పు అంటుకుంది. ఆ సమయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న అశోక్ సమస్యను గుర్తించి మిషన్ దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. పెద్దఎత్తున పొగ, మంటలు చెలరేగడంతో అధికారులు వెంటనే వాటర్ స్ప్రింకర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. షావెల్ పూర్తిగా దగ్ధం అయిపోగా.. మరమ్మతులు చేసినా పనికిరాని స్థితికి చేరింది. ఇది కాలం చెల్లినదని కార్మికులు, అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
మరణాలు ఉండొద్దు..
చుంచుపల్లి: మాతృ, శిశు మరణాలను నివారించేందుకు ఆరోగ్య సిబ్బంది సమష్టిగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ తుకారామ్‌రాథోడ్ సూ చించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవం అనంతరం పిల్లలు రెండేళ్ల వయస్సు వచ్చేవరకు ఆరోగ్యం, పోషకా హారం, వైద్య సేవలపై బాలింతలకు అవగా హన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి ప్రతాప్, మెడికల్ ఆఫీసర్లు, నాగభూషణం పాల్గొన్నారు.


