భక్తుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆలయాభివృద్ధి
అశ్వారావుపేట: రానున్న కాలంలో అశ్వారావుపేట హార్టికల్చర్ హబ్‌గా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా కేంద్రం(హెచ్‌ఆర్‌ఎస్)లో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో ప్రభుత్వ ఉద్యాన కళాశాలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ రైతుల ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించి కళాశాలకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానల వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా మాట్లాడారు. ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గోపి, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, వ్యవసాయ విశ్వవిద్యాల వైస్ చాన్స్‌లర్ ఏ.జానయ్య, వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి దివ్యక్షేత్రాన్ని భక్తుల ఆకాంక్షలకు తగినట్లుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, దేవస్థానం ఈఓ దామోదర్‌రావులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాడ దుర్గా ప్రసాద్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, చల్లగుళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ
శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


