ఖమ్మంగాంధీచౌక్: భారతీయ సంస్కృతికి సంగీతం ప్రతిబింబంలా నిలుస్తుంది. అనేక రకాల వాయిద్యాలు శబ్దాన్ని సృష్టించి సంగీతాన్ని పలకిస్తాయి. ఈ నేపథ్యాన చిన్నతనంపై సంగీతంపై ఆసక్తి పెంచుకుంటున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో వాయిద్యాలు నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా ఖమ్మంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హార్మోనియం, తబలా, కంజర తదితర పరికరాలతో పాటు సంగీతంలో రేణుక శిక్షణ ఇస్తున్నారు. సంగీతం భారతీయ సంస్కృతిని నేర్పడమే కాక విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తుందని రేణుక చెబుతున్నారు. సెలవుల్లో రద్దీ దృష్ట్యా ఉదయం వేళ మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.


