స్వీయ రక్షణకు బాలికలు తప్పకుండా కరాటే శిక్షణ తీసుకోవాలి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన కరాటే శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. రెండేళ్లుగా కరాటే నేర్చుకుంటున్నా.. బ్లాక్‌బెల్ట్‌కు ఎంపికయ్యాను. – వర్షి, సత్తుపల్లి
కరాటే నేర్చుకోవటం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు చదువులోనూ ఏకాగ్రత పెరుగుతుంది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతారు. బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకొని ప్రావీణ్యం సాధించాలి.
– కె.ప్రణీత్య, సత్తుపల్లి
వేసవి సెలవుల్లో కరాటే శిక్షణకు వస్తూ సద్వినియోగం చేసుకుంటున్నా. ఇది నాకు క్రమశిక్షణ నేర్పింది. ఏదైనా ఆపద వస్తే ఎదిరించగలననే ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
– ఆఫ్రిన్, సత్తుపల్లి


