క్రేజీ.. కరాటే | - | Sakshi
Sakshi News home page

క్రేజీ.. కరాటే

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

● ఆత్మరక్షణలో కీలకం ● శిక్షణ ఇప్పించడంపై తల్లిదండ్రుల ఆసక్తి ● కిటకిటలాడుతున్న ఉచిత శిక్షణ శిబిరం మెళకువలతో కరాటే.. ఉత్సాహం చూపిస్తున్నారు..

● ఆత్మరక్షణలో కీలకం ● శిక్షణ ఇప్పించడంపై తల్లిదండ్రుల ఆసక్తి ● కిటకిటలాడుతున్న ఉచిత శిక్షణ శిబిరం

కరాటే శిక్షణలో మెళకువలతో నేర్పిస్తున్నారు. శరీరాన్ని, మనస్సును ఉత్సాహపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. చదువులోనూ ఏకాగ్రత కన్పిస్తుంది. కరాటే వల్ల శారీరక ధృడత్వం లభిస్తుంది.

– హేమచంద్ర, సత్తుపల్లి

శారీరకంగా, బలంగా మారేందుకు కరాటే దోహదపడుతుంది. మానసికంగా, ధైర్యంగా ఉండడంతో పాటు ఆపదను దాటగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరాటే శిక్షణకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు.

– వి.పిచ్చయ్య, కరాటే మాస్టర్‌, సత్తుపల్లి

సత్తుపల్లిటౌన్‌: ప్రస్తుత సమాజ పోకడలను పరిశీలిస్తే ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. ఎవరో వస్తారని చూడకుండా ఆత్మరక్షణకు సిద్ధమయ్యేలా కరాటే ఉపకరిస్తుంది. దీంతో వేసవి సెలవులను కరాటేలో ప్రావీణ్యం సంపాదించుకునేలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈక్రమాన సత్తుపల్లిలోని జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిసరాలు అలర్ట్‌.. బో అరుపులతో మార్మోగుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాస్టర్‌ వి.పిచ్చయ్య ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటేతో ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని గుర్తించడంతో ఆసక్తి నెలకొనగా.. నిత్యం 50 – 60 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement