● 17 నుంచి జూన్ 15 వరకు బంద్ ● అధిక జ్యేష్ఠమాసం కావడంతో నెల పాటు వెలవెల ● పలువురి ఆదాయానికి గండి
పాల్వంచరూరల్: అధిక జ్యేష్ఠమాసం రావడంతో నెల పాటు శుభముహూర్తాలు లేవని పెద్దమ్మతల్లి ఆలయ వేదపండితులు పద్మనాభ శర్మ తెలిపారు. స్వస్తిశ్రీ చాంజ్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో వివాహలు, గృహప్రవేశాలు, ఇతర శుభ ముహూర్తాలు వచ్చే నెల 15వ తేదీ వరకు ఉండవని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠమాసం కావడంతో వివాహది, శుభముహూర్తాలు ఉంటాయన్నారు.
నెల పాటు వెలవెల..
సాధారణంగా వేసవి కాలంలో శుభకార్యాలు ఉంటే అందులో ముఖ్యంగా వివాహలు జరిగితే బ్యాండ్ మేళం దగ్గర నుంచి పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, వంట చేసేవారు, డెకరేషన్ వరకు అందరికీ ఎంతోకొంత ఆదాయం లభిస్తుంటుంది. కానీ అధిక జ్యేష్ఠమాసం పుణ్యమాని నెల పాటు ఎలాంటి శుభముహూర్తాలు లేకపోవడంతో వెలవెలబోనున్నాయి. వర్షాకాలం మొదలైతే ముఖ్యంగా వివాహలు చేయడం కష్టం ఉంటుందని, ఎక్కువ శాతం మేలోనే అధికంగా వివాహ ముమూర్తాలు పెట్టుకుంటారు. కాని అధిక మాసం అందరి ఆదాయానికి గండికొట్టినట్లయింది.


