పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
నేడు రుద్రహోమం
పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం రుద్రహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ.ఎన్.రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు.
ఇత్తడి హుండీలు వితరణ
అమ్మవారి ఆలయానికి అడపాల వెంగళరావు, నాగమణి, తోట నాగేశ్వరరావు, లీలావతి దంపతులు రూ.70 వేల విలువైన రెండు ఇత్తడి హుండీలను వితరణ చేశారు. గురువారం ఆలయంలో ఈఓ రజనీకుమారికి వితరణచేశారు. ఈ సందర్భంగా దాతలకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోని శివాలయంలో గురువారం అర్చకులు నందీశ్వర స్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు.


