డెంగీ కేసులు, చికిత్సపై ఆరా | - | Sakshi
Sakshi News home page

డెంగీ కేసులు, చికిత్సపై ఆరా

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

మణుగూరు రూరల్‌: బెంగళూరులోని పబ్లిక్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎపిడమాలజిస్ట్‌ యమన్యుల్‌, జిల్లా సహాయ మలేరియా అధికారి(ఏఎంఓ) కుమారస్వామి బుధవారం మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో నమోదైన డెంగీ కేసులు, పరీక్షలు, చికిత్స వివరాలపై పీహెచ్‌సీ వైద్యాధికారి సునీల్‌తో చర్చించారు. అలాగే, పీహెచ్‌సీలో పరీక్షలకు ఉన్న వసతులపై ఆరా తీశారు. ఆతర్వాత డెంగీ తదితర సీజనల్‌ వ్యాధులను సమర్ధవంతంగా అరికట్టేలా అనుసరించాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశారు. ఉద్యోగులు వీరస్వామి, సత్యనారాయణ, సత్యమ్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement