కేటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి రికార్డ్‌ | - | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి రికార్డ్‌

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

పాల్వంచ: పాల్వంచ కేటీపీఎస్‌ 5వ దశ కర్మాగారంలోని 9వ యూనిట్‌లో నిరంతరాయంగా వంద రోజుల పాటు విద్యుత్‌ ఉత్పత్తితో రికార్డు సాధించింది. 250 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌లో జనవరి 31 నుంచి ఈనెల 12వ తేదీ వరకు నిరవధికంగా ఉత్పత్తి కొనసాగింది. ఈ సందర్భంగా బుధవారం కర్మాగారంలో సీఈ ఎం.ప్రభాకర్‌రావు, ఎస్‌ఈ సత్యనారాయణ కేక్‌ కట్‌ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. యూనిట్‌ నిరంతరాయంగా, ఏ ఆటంకాలు లేకుండా నడవడానికి చేసిన కృషిని అభినందించారు. ఎస్‌ఈలు బి.శివరామిరెడ్డి, జీ.వీ. ధర్మారావు, పి.కృష్ణ, డీవైసీసీఏ రామారావు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement